ప్రభాస్ కి ఈరోజు ఎందుకు అంత స్పెషల్ తెలుసా..?

ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఈయన పేరు పాపులర్ అవుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇతర భాషలలో కూడా క్రేజీని సంపాదించుకున్నారు. ఇతర దేశాలలో కూడా ప్రభాస్ అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఇక తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఆది పురుష్ సినిమాతో మరింత పాపులారిటీ అందుకున్నారు.

అయితే ప్రభాస్ కు ఈ రోజు చాలా స్పెషల్ డే అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎందుకంటే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ప్రభాస్ ఈరోజుతో ఆయన సినీ కెరియర్ ప్రారంభమై ఇప్పటికి 21 ఏళ్లు అవుతోందట. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్… జయంత్ పరాంజి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమా విడుదల.. నవంబర్ 11..2002 లో విడుదలయ్యింది.

Free Photo : Prabhas- Eeswar movie
కానీ మొదటిసారి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది 28-6-2002 అంటే సరిగ్గా ఇదే రోజు ఈశ్వర్ సినిమా పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటి షాటుకు కృష్ణంరాజు క్లాప్ కొట్టడం జరిగింది.. ప్రభాస్ ఇందులో మాస్ హీరోగా కనిపించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ ఏ రేంజ్ లో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన పెదనాన్న ఆశీర్వాదంతో తన సినీకేరణ ప్రారంభించిన ప్రభాస్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.అత్యధిక రెమ్యూనరేషన్ అద్దుకుంటున్న హీరోగా ప్రభాస్ పాపులారిటీ సంపాదించారు.