ఆ స్టార్ హీరో పై ఇష్టంతో భర్తతో గొడవ పడడానికి కూడా సిద్ధం అంటున్న రంభ..!

Rambha: ప్రముఖ స్టార్ హీరోయిన్ రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు.. మరీ ముఖ్యంగా నేటితరం యువతకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన రంభ (Rambha)సీనియర్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ భాషలలోనే కాదు భోజ్ పురి ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి అక్కడ ఆరాధ్య దేవతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక తెలుగు హీరోయిన్ అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి.

Rambha's divorce issue is a closed chapter now - IBTimes India

ఇక ఈమె అలా ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు నటీనటులు కూడా ఎక్కడైనా టాలెంట్ తో తమ సత్తా చాటగలరు అని నిరూపించింది. ఇకపోతే హీరోయిన్ గానే కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడి చేసిన ఈమె ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి సందడి చేసింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి విదేశాలలో స్థిరపడ్డ ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం గమనార్హం.. రంభ మాట్లాడుతూ.. తనకు ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టం అని.. ఆయన తన డాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఈమె అదే ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి కూడా పలు ఆసక్తికరమైన కామెంట్లు వెల్లడించింది. ఇక ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ.. ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల..

ఒకవేళ ప్రభాస్ తో కనుక నటించే అవకాశం వచ్చి ఆయన ఊ అంటే నా భర్తతో కూడా గొడవ పడడానికి సిద్ధమే.. అలా గొడవపడి మరీ ప్రభాస్ తో నటిస్తాను అంటూ ఆమె ఓపెన్ కామెంట్స్ చేసింది.ఇకపోతే ప్రభాస్ గురించి రంభ చేసిన ఈ కామెంట్స్ ప్రభాస్ అభిమానులను మరింత ఆనందానికి గురి చేస్తున్నాయి.