యాంకర్ సుమ నెల సంపాదన ఎంతో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈమె సుపరిచితమే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో దశాబ్దాలు అవుతున్న సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. తనదైన టైమింగ్ పంచులతో కామెడీ టైమింగ్ తో ఇప్పటికి బుల్లితెరపై మకుటం లేని మహారాణిల కొనసాగుతోంది. టాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లలో సైతం సుమ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. యాంకర్ గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్లు , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్టుగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది.

Anchor Suma Remuneration For Bigg Boss Wild Card Entry

ఇలా రెండు చేతుల సంపాదిస్తున్న సుమ రోజు రోజుకి తన క్రేజీలు మాత్రం పెంచేస్తూ రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తూ ఉంటోంది .యాంకర్ సుమ ఒక్కో ఈవెంట్ కు దాదాపుగా రూ .3 నుంచి రూ .5 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సుమ ఏదైనా ఒక ఎపిసోడ్ చేసిందంటే దాదాపుగా రూ .3లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక యాంకర్ సుమ నెల సంపాదన దాదాపుగా పాతిక లక్షలకు పైగా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక సుమ యాంకర్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా పేరు పొందింది. గత కొద్ది రోజుల క్రితం సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమాలో కూడా నటించింది ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కానీ తన కొడుకుని హీరోగా ఒక సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయబోతోంది. ప్రస్తుతం యాంకర్స్ సుమ కు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.