తెలుగ‌మ్మాయిల‌కు అది త‌క్కువ‌.. అందుకే ఆఫ‌ర్లు రావంటూ డైరెక్ట‌ర్ తేజ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో తెలుగ‌మ్మాయిల‌కు ఆఫ‌ర్లు ఇవ్వ‌రు అనే టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఒక‌వేళ ఇచ్చినా చిన్న చిన్న పాత్ర‌లు త‌ప్పితే.. హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ ఇవ్వ‌రు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా స‌త్తా చాటుతున్న వారంద‌రూ ప‌క్క రాష్ట్రాల నుంచి వ‌చ్చిన‌వారే. అందుకే తెలుగమ్మాయిలు టాలీవుడ్ కంటే ఇత‌ర భాష‌ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంటారు.

 

ఇత‌ర భాష‌ల్లో నేమ్‌, ఫేమ్ సంపాదించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే తెలుగ‌మ్మాయిల‌కు ఎందుకు ఇక్క‌డ ఆఫ‌ర్లు రావు అనే అంశంపై డైరెక్ట‌ర్ తేజ స్పందిస్తూ బోల్డ్ కామెంట్స్ చేశారు. `అహింస‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న తేజ‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తేజ ఇక్క‌డి అమ్మాయిల‌ను ఎందుకు హీరోయిన్లుగా తీసుకోరు అన్న‌దానిపై మాట్లాడారు.

`వాస్త‌వానికి తెలుగమ్మాయిలకి ఓపిక తక్కువ. అందుకే వారికి ఆఫ‌ర్లు రావు. నేను తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా పెట్టుకుందాం అని ఎన్నో సార్లు అనుకున్నాను. ఒకసారి కొంతమందికి ఫోటో షూట్లు,, లుక్ టెస్ట్ లు చేయించాను. హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని ట్రై చేశాను. ఆరు నెలలు ఆగమని చెప్తే.. వాళ్ళు ఆగలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తొందర పెట్టడం, సొసైటీకి భయపడటం.. వంటి కారణాలతో ఎక్కడో మూలన నిలబడే క్యారెక్టర్ల కోసం వెళ్లిపోయారు. ఇలా రెండు నాకు రెండు, మూడు సార్లు జ‌రిగింది.` అంటూ తేజ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.