ఈ దర్శకులకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..

ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని బయట పెట్టాలంటే అతను మరొకరి దగ్గర శిష్యరికం చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారందరూ ఒకప్పుడు ఎవరో ఒకరి దగ్గర పని చేసిన వారే. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ పనిచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినప్పటికీ రామ్ గోపాల్ వర్మ వద్ద మాత్రం ఒక స్టూడెంట్ గానే మెలుగుతాడు. అలానే డైరెక్టర్ కృష్ణవంశీ కూడా రామ్ గోపాల్ వర్మ ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ కింద దర్శకుడు తేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఇక టాలీవుడ్ జక్కన ఎస్ ఎస్ రాజమౌళి మొదట్లో ఎడిటింగ్ వర్క్ నేర్చుకొని కే రాఘవేంద్ర రావు దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య వద్ద గోకులంలో సీతా, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య, పవిత్ర ప్రేమ లాంటి సినిమాలకు బోయపాటి శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈవివి సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసిన శ్రీను వైట్ల గురువుపైన ఉన్న భక్తితో ఈవివి కుమారుడు ఆర్యన్ రాజేష్ తో ‘సొంతం’ అనే మూవీ చేసాడు. అలానే ‘దిల్ ‘ డైరెక్ట్ చేసే సమయంలో వివి వినాయక్ వద్ద సుకుమార్ పనిచేసారు.

రచయిత, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి కింద పనిచేసి కొరటాల శివ కాస్త అనుభవం సంపాదించుకున్నాడు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ మొదటి గురువు కృష్ణ మురళి అయినా కూడా డైరెక్టర్ విజయ భాస్కర్ దగ్గర రైటర్ గా ఉంటూ డైరెక్షన్ లో మెలుకువలు మెర్చుకున్నాడు. ‘తమ్ముడు’ సినిమా డైరెక్టర్ అరుణ్ ప్రసాద్, f3 డైరెక్టర్ అనిల్ రవీపూడి ఇద్దరు బంధువులు. అందుకే ఆయన వద్ద ఒక రెండు సినిమాకు పనిచేసి, సౌర్యం సినిమాతో డైలాగ్ రైటర్ గా కెరీర్ ప్రారంభించాడు. ‘మహానటి ‘ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా శేఖర్ కముల కింద ‘లైఫ్ ఇజ్‌ బ్యూటిఫుల్ ‘ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసాడు.