సుడిగాలి సుదీర్ ఒక చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా, కమెడియన్ గా చేసి ఇప్పుడు వెండితెరపై హీరోగా నిలిచాడు సుడిగాలి సుదీర్.. మొదటగా మ్యాజిక్ షో చేస్తూ ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుధీర్ చిన్నప్పటినుంచి చాలా కష్టాలను అనుభవించి ఈ పొజిషన్ కు ఎదిగాడు. ఇప్పుడు ఒక్కో షో కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు స్టార్ హీరోలతో సహా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. సుధీర్ మొదటగా చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో కనిపించేవాడు. కానీ ఇప్పుడు హీరో పొజిషన్ కు ఎదిగాడు. మొదట ఒక సినిమా చేశాడు అది పర్వాలేదు అనిపించింది.. ఇక రెండో సినిమా ఫెయిల్యూర్ కావడంతో.. మూడో సినిమా గాలోడు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుంది..

Gaalodu Is A Pakka Commercial Mass Entertainer: Sudigali Sudheer

ఇది కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ ఎక్కువగా అడుగుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు చేసే ఒక్కో సినిమాకు రూ .4 కోట్ల రూపాయలకు తక్కువ అడగటం లేదట.ప్రస్తుతం గోట్ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇందులో తమిళ్ హీరోయిన్ తో జటకట్టబోతున్నాడు. దివ్యభారతి ఇందులో సుధీర్ కు జోడిగా నటిస్తోంది.. ఈ సినిమా డైరెక్టర్ కూడా మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది.ఈ సినిమా విశేషాలు మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సుధీర్ హీరోగా ఎదగడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక జబర్దస్త్ షోకు కూడా గుడ్ బై చెప్పేసి ..ఇతర చానల్స్ లో యాంకర్ గా చేస్తున్నారు.