డ్రగ్స్ కేసులో ఆషు రెడ్డి పేరు.. షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ విషయం తెగ వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా బుల్లితెర నటి ఆషు రెడ్డి కూడా చిక్కుల్లో పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో కథ కొద్దిరోజులుగా విచారణ జరుగుతున్న సమయంలో 12 మంది సినీ సెలెబ్రెటీల పేర్లను తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ సెలబ్రిటీల మధ్య సంబంధాలేవి.. డ్రగ్స్ విషయంలో వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది అంటూ విచారణలో 12 మంది తనతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని విషయాన్ని కేపీ చౌదరి తెలియజేశారు.
ప్రస్తుతం అతడి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డేటాను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అందులో కొన్ని భయంకరమైన నిజాలు కూడా తెలుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 9000 మంది ఫోటోలు అతని మొబైల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎందరో సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు సమాచారం.అలాగే వారి యొక్క కాల్ లిస్ట్ లో కూడా సెలబ్రిటీల పేర్లు చాలానే ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా కేపీ చౌదరి ,ఆషు రెడ్డి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి అనే విషయంపై అందరికీ అనుమానాలు మొదలవుతున్నాయి. దాదాపుగా కేపీ చౌదరితో ఆమెకు వందకు పైగా కాల్స్ ఎందుకు మాట్లాడారు ఆమెకు డ్రగ్స్ లో ఏమైనా ప్రమేయం ఉందా అనే విషయంపై వంటి ప్రశ్నలు కేపీ చౌదరిని పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం.
అలాగే మరొక నటి సురేఖ వాణి ,జ్యోతితో కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి కేపీ చౌదరికి.. అయితే ఈ ముగ్గురు నటీమణుల సంబంధాలేమిటి వారి ప్రమేయం ఏంటి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మందితో కాల్స్ వాట్సప్ చార్టులను డిలీట్ చేసినట్లుగా సమాచారం. దీంతో అధికారులు డేటాను రికవరీ చేయడం ద్వారా మరింత నిజాలు తెలియబోతున్నట్లు తెలియజేస్తున్నారు.