ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి సనన్.. ఆయన కోసమేనా..?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వార్త ఏమిటంటే ప్రభాస్- కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అభిమానులు మాత్రం నమ్మడం లేదు ఎందుకంటే వీరిద్దరూ క్యూట్ పెయిర్ గా పేరు పొందారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మంచి పాపులారిటీ సంపాదించింది.

రీసెంట్గా వీరిద్దరూ కలిసి ఆదిపురుష్ చిత్రంలో నటించారు ఈ సినిమా వచ్చే నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఈ సందర్భంగా ప్రభాస్ మరియు కృతి సనన్ నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్గా కృతి సనన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే రీసెంట్ గా ఒక గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ వీడియోలో ఆమె ప్రభాస్ కోసమే పూజలు చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ మోకాళ్ళకి సంబంధించి ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్ కరెక్ట్ గా జరిగితే గుడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేయిస్తానని మొక్కుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆమె గుడిలో పూజలు చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది అయితే ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజలు చేయిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏది నిజమో తెలియాల్సి ఉన్నది.