సిల్క‌ర్ క‌ల‌ర్ చీర‌లో కీర్తి సురేష్ గ్లామ‌ర్ మెరుపులు.. బ్యాక్ చూపిస్తూ హాట్ పోజులు!

అందాల భామ, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహానటి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అనంతరం వరుస ఫ్లాపులతో సతమతం అయ్యింది.

కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్న సమయంలో సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.

నాని హీరోగా తెరకెక్కిన ఈ రా అండ్ ర‌స్టిక్ ఫిల్మ్‌ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ విజయం త‌ర్వాత కీర్తి సురేష్ కొత్త సినిమాల ఎంపికలో బిజీ అయింది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామ‌ర‌స్‌ ఫోటోషూట్లతో కుర్ర కారు గుండెల్లో మంటలు రేపుతుంది. కరీర్‌ ఆరంభం నుంచి కాస్త గ్లామర్ షో కి దూరంగా ఉన్న కీర్తి.. ఇటీవల రూటు మార్చింది. హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తోంది.

తాజాగా సిల్వర్ కలర్ చీరలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలను చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిచ్చింది.

ప్రస్తుతం కీర్తి తాజా ఫోటోలు నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి కీర్తి సురేష్ లో ఇంత హాట్ నెస్ ఉందా అంటూ నెటిజన్లు హీటెక్కిపోతున్నారు.