త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతున్న మృణాల్‌.. అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన బ్యూటీ!

`సీతారామం` మూవీతో టాలీవుడ్ లో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్ త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆమె అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. అంటే మృణాల్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతుందా.. అంటే కానే కాదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

ఇటీవ‌ల మృణాల్ హైద‌రాబాద్ లో కోట్లు ఖ‌ర్చు పెళ్లి ఓ ఇంటిని కొనుగోలు చేసిందంటూ పెద్ద‌న ఎత్తున వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాసంగా ఈ ఇల్లు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇదే విష‌యంపై నెటిజ‌న్లు మృణాల్ ను అడ‌గ‌గా.. ఆమె వ్యంగ్యంగా బ‌దులిచ్చింది.

`నేను కొన్నాను అనుకుంటున్న ఇంటి అడ్రస్‌ చెప్తే.. నేను కూడా వెళ్లి నా ఇంటిని చూసొస్తా` అంటూ స‌మాధానం ఇచ్చింది. తాను హైద‌రాబాద్ లో ఇల్లు కొన్నాన‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను ఆమె ఖండించింది. అయితే హైదరాబాద్‌ తనకు ఎంతో నచ్చిన నగరమని, ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో ఇల్లు కొనకపోయినా భవిష్యత్తులో కొనే ఆలోచని ఉందని మృణాల్ వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో ఓ ఇల్లు కొని.. ఓ ఇంటిదాన్ని అవుతాన‌ని పేర్కొంది.

Share post:

Latest