గత కొద్దిరోజులుగా నటుడు సిద్ధార్థ్- అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవ్వడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా కలిసి పాల్గొనడం జరుగుతోంది . దీంతో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ప్రేమలో ఉన్నాము కాని..లివింగ్ లో ఉన్నామని కానీ క్లారిటీ అసలు ఇవ్వలేదు.. వీరిద్దరిపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నప్పటికీ మౌనంగానే ఉన్నారు.. అయితే తాజాగా ఎట్టకేలకు ఈ విషయంపై అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది
సిద్ధార్థ్- అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నామంటూ తన సిగ్గుతో సమాధానం తెలియజేసింది.. అతిధి నటించిన జూబ్లీ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈమె ప్రేమకు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురు కావడం జరిగిందట. మీడియా వారు..సిద్ధార్థ్ తో ప్రేమ విషయం గురించి స్పందించాలని కోరగా ఆ సమయంలో ఆమె నవ్వుతూ సిగ్గుపడడం జరిగింది.అంతేకాకుండా ఆమె సిగ్గుపడుతూ తన చేతులతో సమాధానం దాటేసినట్లు కనిపిస్తోంది.
ఇక ఈ విషయం నిజం కాకపోతే గట్టిగా సమాధానం ఇచ్చేది అన్నట్టుగా అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. లేకపోతే సిద్ధార్థ్ తనకు మంచి స్నేహితుడని క్లారిటీ ఇచ్చేది కానీ సిగ్గుపడి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు నిజమేనంటూ మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి మెప్పించింది ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలలో నటిస్తోంది.