ఏంటీ.. హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఎన్టీఆర్ అలా సెటిల్ అయ్యేవాడా..?

విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. బాల్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ త‌ర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ప‌డ‌టంతో ఇర‌వై ఏళ్ల‌కే ఎన్టీఆర్ స్టార్ హోదాను అందుకున్నాడు.

నంద‌మూరి ఫ్యామిలీ అండ‌దండ‌లు లేక‌పోయినా త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఒకవేళ హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఏం చేసేవారు..? అనే ప్ర‌శ్న గ‌తంలో ఎన్టీఆర్ కు ఎదురైంది. అందుకు ఆయ‌న చెప్పిన స‌మాధానం వింటే షాకైపోతారు.

తాను హీరోగా సక్సెస్ కాకపోయినా సినీ ఇండ‌స్ట్రీలోనే ఏదో ఒక పని చేసుకుంటూ సెటిల్ అయ్యేవాడిని అంటూ ఎన్టీఆర్ వెల్ల‌డించారు. ఆ ఒక్క మాట‌తో ఎన్టీఆర్ కు సినిమాలంటే ఎంత ప్రాణామో అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థ‌మైంది. కాగా, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి `దేవ‌ర‌` అనే టైటిల్ ను లాక్ చేస్తుంది. ఇందులో జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Share post:

Latest