టాలీవుడ్ లో ఒకప్పటి అందాల నటి శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుఖం.. ఈమె అప్పట్లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.. అప్పటి అగ్ర హీరోలు అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు తన కూతురు జాన్వీ కపూర్ ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెడుతోంది. శ్రీదేవి అనుకున్నట్టు గానే ఎన్టీఆర్ తో సినిమా తీయాలని తన ఆశ నెరవేరింది.
ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం” దేవర” ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణను అక్టోబర్ పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా చిత్ర బృందం తెలుస్తోంది.అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెడుతుందా అని అందరూ వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఆ అవకాశం ఇప్పుడు ఆమెకు రావడం జరిగింది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే జాన్వీ బాగానే సినిమాలలో నటించింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
తెలుగులో మాత్రం మొదటి సినిమా అయినా ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. దేవర సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందట. యూనిట్ సభ్యుల అందుతున్న ప్రకారం జాన్వీ కపూర్ ఒక మత్స్యకారుని కూతురుగా నటిస్తోందట. అందులో లంగా ఓని లోనే కనిపించబోతోందని సమాచారం.దేవర సినిమాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత ను చూస్తుంటే రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఆమె పోస్టర్ని చూస్తుంటే అలా అనిపిస్తోంది ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు.