మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 18 ఏళ్లు అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది.
ఈ సంగతి పక్కన పెడితే తమన్నాకు జాతకాల పిచ్చి ఉందని మీకు తెలుసా..? అవును తమన్నా కూడా జాతకాలను నమ్ముతుందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయట పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసింది.
13 ఏళ్ల వయసులోనే సినీ గడప తొక్కిన తమన్నా ఇరవై ఏళ్లకే స్టార్డమ్ ను అందుకుంది. అయితే జాతకాలు బాగా నమ్మే తమన్నా.. హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు తన పేరును మార్చుకుందట. ఓ న్యూమరాలజిస్ట్ సలహా మేరకు తన పేరులో ఏ, హెచ్.. రెండు అక్షరాలు జోడించుకుంది. ఆ తర్వాత నిజంగానే ఆమెకు లక్ కలిసొచ్చిందట. ఇక తమన్నా 8 నెంబర్ ను దురదృష్ట సంఖ్యగా భావిస్తుందట. 8 నెంబర్ ఆమెకు అస్సలు కలిసిరాదట.