తెలుగు హీరో వేధింపులకు గురిచేశాడు.. హన్సిక షాకింగ్ కామెంట్స్..!!

ఎ ఇండస్ట్రీలో నైనా సరే మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎంతోమంది సినీ సెలబ్రెటీర్ సైతం తెలిపారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది. హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హన్సిక మొదట బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లోకి మాత్రం దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

No matter what she wears, just wear it...Hanshika looks stunning in a blue  saree..! – Update News 360 | Tamil News Online | Live News | Breaking News  Online - Time News

ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తమిళంలో కూడా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అగ్ర హీరోల తరఫున నటించింది. తమిళంలో ఏకంగా హన్సికకు ఒక గుడి కట్టారంటే ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు.. హన్సిక హీరోయిన్గా ఎంతటి పేరు తెచ్చుకుందో అంతె వివాదాల ద్వారా కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది.. నయనతారతో శింబు బ్రేకప్ అయిన తర్వాత హన్సిక కొన్నేళ్లపాటు ప్రేమాయణం కొనసాగిందని తామద్దరం ప్రేమలో ఉన్నామని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది.

Hansika Motwani, actress, hansika, HD phone wallpaper | Peakpx
కానీ నటుడు శింబు ప్రవర్తన నచ్చకపోవడంతో కొన్ని రోజులకు అతనితో బ్రేకప్ చెప్పింది.. ఆ సమయంలో సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో గత ఏడాది వివాహం చేసుకుంది. తన బిజినెస్ పార్టనర్ సోహైల్ను వివాహం చేసుకుంది హన్సిక. హన్సిక భర్తకు ఇది రెండవ వివాహం. ఇండస్ట్రీలో తాను కూడా అందరితోపాటు అవమానాలను ఫేస్ చేశానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఒక డిజైనర్ తనతో రోడ్డుగా బిహేవ్ చేశారని మోడల్ బట్టలు నాకు చేయిస్తారా.. అని అడిగితే.. వాళ్లు కుదరదని మొహం మీదనే చెప్పేసే వాళ్ళని తెలిపింది.. కానీ అలా అవమానించిన వారే ఇప్పుడు డిజైనర్లుగా పనిచేయడానికి వెతుక్కుంటూ వస్తున్నారని తెలుపుతోంది.

ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపుల గురించి కూడా తెలిపింది. తెలుగు హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశారని డేట్ కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవారని తెలిపింది. హీరో కానీ ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ధి చెప్పానని తెలిపింది హన్సిక. కానీ ఆ హీరో పేరు చెప్పడానికి ఇష్టపడలేదు దీంతో అభిమానుల సైతం ఎవరా హీరో అంటూ ఆరా తీస్తున్నారు.

Share post:

Latest