గత శుక్రవారం విడుదలైన చిత్రం `బిచ్చగాడు 2`. బిచ్చగాడు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. 2016లో తెలుగు, తమిళ భాసల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చగాడు 2` వచ్చింది.
ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. మే 19న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఫైనల్ గా అది హిట్ టాక్ గా మారింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఊచకోత కోస్తోంది.
తెలుగులో మూడు రోజుల్లోనే దాదాపు క్లీన్ హిట్ అయింది. తెలుగులో రూ. 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే రూ.5.82 కోట్లు రాబట్టి సగం టార్గెట్ ను రీచ్ అయింది. మొదటి రోజు నుంచి కోటిన్నరకు తగ్గకుండా వసూల్ చేస్తున్న ఈ చిత్రం.. 3వ రోజు సండే అడ్వాంటేజ్ తో రూ.1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. రూ. 68 లక్షలు రాబడితే.. తెలుగులో ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 16 కోట్ల టార్గెట్ తో వచ్చిన బిచ్చగాడు 2.. మూడు రోజుల్లో రూ. 10.40 కోట్ల షేర్, రూ.21.25 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.