బాలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన డైరెక్టర్ రాజమౌళి..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల ఆ బ్రేక్ నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ సినిమా పనుల కోసం బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమానే పాన్ వరల్డ్ రేంజ్‌లో వెండితెరపై రూపొందించడానికి టాలీవుడ్ జక్కన్న సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అమెజాన్ అడవులో ఉంటుందనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.

ఈ సినిమాలో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్‌గా మహేష్ బాబు కనిపించబోతున్నాడు. అయితే వచ్చే సంవత్సరంలో ఈ సినిమా స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి క్యాస్టింగ్ పనులు కూడా కంప్లీట్ చేస్తారట. అయితే మహేష్ సినిమా పూర్తి కాగానే రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారని టాక్. రాజమౌళి టాలెంట్ చూసి చాలా మంది బాలీవుడ్ స్టార్లు ఆయన డైరెక్షన్‌లో ఒక సినిమా అయినా చేయాలని ఆశపడుతున్నారట. కానీ రాజమౌళి మాత్రం ఎక్కువగా టాలీవుడ్ హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే రాజమౌళి ముందుగా మహేష్ బాబు సినిమాపై ఫోకస్ పెట్టాడు.

ఇప్పుడే కాదు ఇకముందు ఎప్పుడైనా సరే బాలీవుడ్ స్టార్స్ రాజమౌళి డైరెక్షన్ లో నటించాలి అనుకున్న కూడా మన జక్కన మాత్రం టాలీవుడ్ హీరోలకే ప్రేయారిటీ ఇస్తాడట. ఒకవేళ బాలీవుడ్ హీరోలతో సినిమా సినిమా చేయాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ నటించిన కీలక పాత్రలు, గెస్ట్ రోల్స్ లాంటి అవకాశాలు ఇస్తారనే టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ హీరోతో ప్రాజెక్ట్ ఒకే అయిన విషయంపై రాజమౌళి స్పందిస్తే తప్ప ఎవరికీ క్లారిటీ రాదు.

Share post:

Latest