మరింత హాట్ డోస్ పెంచుతోన్న జబర్దస్త్ ప్రియాంక..!

సినిమాలలో అవకాశాలను దక్కించుకునేందుకు చాలా మంది నటీమణులు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను బహిరంగంగా ప్రదర్శిస్తుంటారు. కొన్ని సార్లు డోసు పెంచి మరీ గ్లామర్ షో చేసేస్తుంటారు. ఇదే తరహాలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక వెళ్తోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టే తెలుగు ప్రేక్షకులను అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదండోయ్.. గత బిగ్ బాస్ సీజన్‌లో హీరో మానస్‌ను ప్రేమించిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక. ఇలా చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తు వచ్చేస్తుంది. ఇటీవల ప్రియాంక చాలా హాట్ హాట్ గా ఫొటో షూట్స్ చేస్తోంది. తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. తనలోనూ ఎన్నో అంద చందాలు దాగున్నాయని తాజా ఫొటో షూట్స్ ద్వారా అందరికీ చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా బ్రాలో ఆమె తన అందాలను చూపిస్తూ, నెటిజన్లను కవ్విస్తోంది.

ప్రియాంక అందరికీ తొలుత జబర్దస్త్ ద్వారానే తెలుసు. ఆ కామెడీ షోలో మొదట్లో సాయితేజగా కనిపించేది. లేడీ గెటప్‌లు వేసుకోవడం, మహిళల్లా కనిపించడం వంటివి చేసేది. కొన్నాళ్లకు ముంబై వెళ్లి అక్కడ లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది. మహిళలా మారిపోయింది. ఈ సర్జరీ వల్ల ఆమెకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఈ తరుణంలో ఆమెకు బిగ్ బాస్-5వ సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో ఆ షోలో ఆమె మానస్‌కు సన్నిహితంగా ఉండడం, అతడిని ప్రేమించడం వంటి వాటి ద్వారా బాగా ఫేమస్ అయింది.

అయితే ఆమె ప్రేమను మానస్ తిరస్కరించడంతో భగ్న ప్రేమికురాలు అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా టీవీ షోలలో కనిపించింది. అడపాదడపా సినీ అవకాశాలను దక్కించుకుంది. ఇటీవల ఓ సందర్భంలో తాను కోన వెంకట్ దర్శకత్వంలో రానున్న సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ తరుణంలో తన సినీ కెరీర్ ను మరింత మెరుపర్చుకోవాలనే ఉద్దేశమో ఏమో కానీ హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తోంది. అమ్మాయిల లాగానే ఇన్ స్టా రీల్స్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. ఇవి ఆమె అదృష్టాన్ని ఎంత మేర మార్చుతాయో చూడాలి.

Share post:

Latest