ఆ వ్య‌క్తితో ప్ర‌భాస్ ను పోల్చిన కృతి స‌న‌న్‌.. వైర‌ల్ గా మారిన `సీత` కామెంట్స్‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీతగా న‌టించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అల‌రించ‌బోతున్నారు.

ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆదిపురుష్ ట్రైల‌ర్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో తెలిసిందే. ట్రైల‌ర్ తో సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశారు. అయితే ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా మీడియాతో ఇంట్రాక్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా కృతి స‌న‌న్ త‌న కోస్టార్ ప్ర‌భాస్ పై చేసిన కామెంట్ష్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ప్ర‌భాస్ ను ఏకంగా శ్రీ‌రాముడిగా పోల్చేస్తూ ఆకాశానికి ఎత్తేసింది. రాముడిలాగే ప్ర‌భాస్ చాలా మంచివాడ‌ని, మంచి వ్య‌క్తిత్వం క‌ల‌వాడ‌ని, ఇక అత‌డి సింప్లిసిటీకి ఫిదా కాని వారు ఉండ‌ద‌ని కొనియాడింది. కాగా, గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్త‌లు వ‌స్తున్నారు. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని, పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే టాక్ ఉంది. ఇలాంటి త‌రుణంలో ప్ర‌భాస్ పై కృతి చేసిన కామెంట్స్ ప్ర‌ధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Share post:

Latest