పవన్ సినిమా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై గతంలో హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య పలు రూమర్లు కూడా ఎక్కువగా వినిపించాయి. దీంతో పూనమ్ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని ఓపెన్ గా చెప్పేది. దీంతో ఈమెకు పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్టు కూడా బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్ చేసి పూనమ్ అప్పుడప్పుడు గురూజీ అంటూ ఇన్ డైరెక్టుగా త్రివిక్రమ్ పైన కూడా పలు కామెంట్లు చేస్తూ ఉండేది. ఒక పెద్ద డైరెక్టర్ తనని ఎలా అవమానించారు. అనే విషయంపై పూనమ్ కౌర్ చెప్పిన మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికీ ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. పూనమ్ కర్ ట్విట్టర్ల యాక్టివ్ గా ఉంటూ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా మీద ఫైర్ అవడం జరిగింది.. ఇది తప్పు ఆ మహానీయుడిని అవమానించడమే అంటూ మండిపడుతోంది..

ఈ ట్విట్ మీద అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.. పవన్ కాళ్ళ కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టడంతో పూనమ్ కౌర్ స్పందించింది. ఇది కచ్చితంగా ఆయనను అవమానించడం లాంటిదే అంటూ దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్ కు రిపోర్టు చేయండి అంటూ ట్విట్టర్ చేసింది. దీంతో ఈమె పైన పలు రకాలుగా కౌంటర్లు వేస్తున్నారు అభిమానులు.. దీంతో మళ్లీ ట్విట్ చేస్తూ స్వతంత్ర సమరయోధులను మీరు గౌరవించక పోయిన పర్వాలేదు కనీసం మర్యాద అయిన ఇవ్వాలి ఇలా కించపరచకూడదు అంటూ ఆయన పేరుని నీ కాలి కింద పెట్టుకుంటావా ఇది ఇగోనా..నీ నిర్లక్ష్యమా అంటూ పూనమ్ కౌర్ మండిపడుతోంది.

Share post:

Latest