ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్‌గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పడింది. ప్రస్తుతం రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటిస్తున్నాడు.
దసరా పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే రవితేజ కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రవితేజ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. ఇంతకుముందు ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకున్న రవితేజ.. ఇప్పుడు ఏకంగా రూ. 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
రీసెంట్ గా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ తో రవితేజ ఓ సినిమాకు చేసేందుకు కమిట్ అయ్యాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు రూ. 25 కోట్లు రెమ్యునరేషన్ అడిగాడట. ఆయన డిమాండ్ కు మొదట నిర్మాతలు షాక్ అయినా.. ఆ తర్వాత అంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకోక తప్పలేదని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. రవితేజ గత చిత్రం రావణాసుర డిజాస్టర్ అయింది. అయినా సరే రవితేజ తన రెమ్యునరేషన్ ఇంతలా పెంచడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.