ఇండియన్ మాజీ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం CSK టీంలో కీలకమైన ఆటగాడుగా పేరుపొందారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది .ఇదంతా ఇలా ఉండగా తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో క్రికెటర్ అంబాటి రాయుడు అక్కడికి రావడం జరిగింది.
కొన్ని రోజుల క్రిందట ఏపీ సీఎం జగన్ ప్రశంసల వర్షం కురిపిస్తూ అంబాటి రాయుడు ట్విట్ చేయక జగన్ స్పీచ్ అని షేర్ చేసి గ్రేట్ స్పీచ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నీ మీద పూర్తి నమ్మకంతో ఆశీర్వాదంతో ఉన్నారని రాయడం జరిగింది అంబాటి రాయుడు. గతంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట కోర్టుకు జగన్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ విషయాన్ని కూడా అంబాటి రాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి గొప్ప ప్రసంగం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం విశ్వాసం ఉన్నాయి సార్ అంటూ కామెంట్లు చేశారు.
తాజాగా జగన్ క్యాంపు కార్యాలయానికి అంబాటి రాయుడు కలవడంతో ఊహాగానాలు మరిన్ని ఎక్కువయ్యాయి. అంబాటి రాయుడు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీళ్ళ తాత కూడా గ్రామ సర్పంచ్ గా మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం అంబటి రాయుడు వయసు 37 ఏళ్లు. ఏడాది ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఏపీ సీఎం కలవడంతో అంబాటి రాయుడు వైసిపి పార్టీ కి సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Such a honest and passionate speech by the young student Divya Deepika. A true testament to the great development of social infrastructure in Andhra Pradesh by our cm @ysjagan garu.. https://t.co/aTYVO80cJs
— ATR (@RayuduAmbati) April 26, 2023