Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!

దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్‌ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు తమ డ్యాన్స్‌లతో ఉర్రుతలూగించారు.

అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ (విక్రమ్‌ వేద) సొంతం చేసుకోగా, ఉత్తమ నటి అవార్డుని అలియాభట్‌ (గంగూబాయి కాఠియావాడి) సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో ‘దృశ్యం2’ (హిందీ) అవార్డు సొంతం చేసుకుంది. ఇక అత్యధిక అవార్డులను ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’, ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రాలు చేజిక్కించుకోవడం విశేషం. అలాగే భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ నటుడు కమల్‌హాసన్‌ అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు.

ఐఫా 2023 అవార్డుల విజేతలు:

ఉత్తమ చిత్రం: దృశ్యం2
ఉత్తమ దర్శకుడు: ఆర్‌.మాధవన్‌ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ నటుడు: హృతిక్‌ రోషన్‌ (విక్రమ్‌ వేద)
ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)
ఉత్తమ సహాయనటి: మౌనీ రాయ్‌(బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
ఉత్తమ గీత రచయిత: అమిత్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ కొరియోగ్రఫీ: భూల్‌ భూలయా2
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: భూల్‌ భూలయా 2
ఉత్తమ ఎడిటింగ్‌: దృశ్యం2
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1
ఉత్తమ నేపథ్య సంగీతం: విక్రమ్‌ వేద
ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: మోనికా ఓ మై డార్లింగ్‌
ఉత్తమ తొలి చిత్ర నటుడు: శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్‌(ఖులా)(ఇద్దరి మధ్య టై అయింది)
ఉత్తమ తొలి చిత్ర నటి: కుషాలీ కుమార్‌ (దోఖా: రౌండ్‌ డి కార్నర్‌)