బిగ్ బాస్ 7: అలాంటి కంటెస్టెంట్స్ తో మరింత ఇంట్రెస్టింగా మారిపోతుందా!

బుల్లితెర బడా పాపులారిటీ షో బిగ్ బాస్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షో మన తెలుగు బుల్లితెరపైన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మిగతా షోలకు రేటింగ్స్ పడిపోయాయని చెప్పుకోవచ్చు. అంతలా ఇది ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యువత ఈ షోకి ఎక్కువగా ఆకర్షితులు ఐనట్టు తెలుస్తోంది. ఇతర భాషల్లో మన తెలుగులో కంటే ముందుగానే ప్రారంభం అయినప్పటికీ ఇక్కడ సక్సెస్ అయినంతగా ఇంకెక్కడా సక్సెస్ కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు.

షో మొదలైన మొదట్లో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అయ్యేవారు కానీ క్రమంగా షోలో టాస్కులు ఆడుతూ ఉండడం వల్ల ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అలా మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా 5 సీజన్స్ ని నిర్వహించగా వాటిల్లో 4 సీజన్స్ బంపర్ హిట్ అయ్యాయి. అయితే 6వ సీజన్ మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీనితో 7వ సీజన్ ఎలా అయినా గ్రాండ్ హిట్ చెయ్యాలనే కసితో ఉంది స్టార్ మా టీం. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధమైన ఐడియాస్ ని ఈ సీజన్ ద్వారా పరిచయం చెయ్యబోతున్నారని వినికిడి.

ఈ క్రమంలో 7వ సీజన్ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆరవ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం కంటెస్టెంట్స్ కాబట్టి, కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును, ఈసారి తరచూ ఆడియన్స్ కి బుల్లితెర ద్వారా బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీస్ ని పిలవబోతున్నారట. ఇక ఈ సీజన్ లో ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటని మాత్రమే కంటెస్టెంట్స్ గా ఆహ్వానిస్తున్నారని వినికిడి. అంతే కాదు సీక్రెట్ రూమ్ లో కూడా విడిపోయిన జంటని ఉంచబోతున్నారట. కాగా ఇంత ఆసక్తికరమైన ఐడియా ఇప్పటి వరకు ఏ భాషలో కూడా ప్రయోగించలేదని గుసగుసలు వినబడుతున్నాయి.