సీనియర్ హీరోయిన్ నగ్మా అవకాశాల కోసం అలాంటి ఇంజక్షన్లు తీసుకుందా..!

సినిమాలలో నటించాలని కోరిక చాలామందిలో ఉంటుంది.. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ కోరిక ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు అందాన్ని, ఫిజిక్ ను కాపాడుకుంటూ అందంగా తయారవుతూ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతూ ఉంటారు.. ప్రధానంగా అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలంటే వారికి మంచి అందం ఉండాలి. లేదంటే వారికి హీరోయిన్‌గా అవకాశాలు కూడా రావు. ఇదే అనుమానంతో కొంతమంది తమ అందాన్ని పెంచుకోవడం కోసం కొన్ని ట్రీట్మెంట్లల ద్వారా హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ ఉంటారు.

 Actress Nagma Gave Hormone Injections For Opportunities The Real Truth Revealed-TeluguStop.com

అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను అందుకోవాలని కోరికతో త్వరగా పెద్దగా అవటానికి హార్మోన్ ఇంజక్షన్ తీసుకొని హీరోయిన్‌గా చలామణి అవుతూ ఉంటారు. ఇలానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా కూడా హార్మోన్ ఇంజక్షన్ తీసుకున్నారట. తెలుగులో నగ్మా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్ లో వెలిగింది. తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరింది.

Telugu Actress Nagma, Bollywood, Economic, Hormone, Tollywood-Movie

నగ్మా కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని భాషలలో నటించి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఈమె హార్మోన్ ఇంజక్షన్ తీసుకుంది అంటూ వ్యక్తిగతంగా కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా తన ప్రేమ వ్యవహారాలతో కూడా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం పక్కనపడితే నగ్మా గతంలో హార్మోన్ ఇంజక్షన్ చేయించుకుందని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.

Telugu Actress Nagma, Bollywood, Economic, Hormone, Tollywood-Movie

ఆమె తల్లి నగ్మాను చిన్నప్పటి నుంచి హీరోయిన్ చేయాలని కోరిక ఉండేది. నగ్మా తండ్రి అప్పటికే చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగేవాడు అదే సమయంలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్‌ అవటంతో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. దీంతో నగ్మా తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడం కోసం నగ్మను హీరోయిన్‌గా చేయాలని దర్శక నిర్మాతలు చుట్టూ తిరిగేవారట. దీంతో దర్శక నిర్మాతలు ఆమె ఇంకా చిన్న పిల్ల కొన్ని సంవత్సరాల ఆగమని చెప్పారట.

Telugu Actress Nagma, Bollywood, Economic, Hormone, Tollywood-Movie

దీంతో నగ్మా తల్లి తండ్రులు అక్కడితో ఆగకుండా ఎలాగైనా తమ కూతుర్ని హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతో నగ్మాకు ఇష్టం లేకున్నా ఆమెకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారట. ఇంజక్షన్స్ తీసుకున్న సమయంలో నగ్మా వయసు కేవలం 13 సంవత్సరాలట. ఆ తర్వాత కొంతకాలానికి తన శరీరంలో మార్పులు వచ్చాయని దీంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిందని తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest