నరేష్ కుమారుడికి ఇంత టాలెంట్ ఉందా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ చెప్పిన హీరో..

 

 

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అలా మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్, నవీన్ ఇలా ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు చిన్నప్పటినుండి స్నేహితులుగా మెలుగుతున్నారు. ఐతే ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. కాగా యాక్సిడెంట్ జరిగిన రోజు డీకే నరేష్ కుమారుడు నవీన్ బాగా తల్లడిల్లాడట. అంతేకాదు, ఆరోజు హుటాహుటిన సాయి ధరమ్ తేజ్ ఇంటికి కూడా కూడా వచ్చి వెళ్లాడని నవీన్ తండ్రి నరేష్ చెప్పాడు.

మళ్ళీ ఇన్నిరోజులకి సాయి ధరమ్ తేజ్, నవీన్, మంచు మనోజ్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ అందరూ హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటాడు. మెగా ఫ్యామిలీతో అయితే ఇంకా ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటాడు. మనోజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ కలిసిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇటీవలే జరిగిన మనోజ్ పెళ్లి తేజ్ ఎంత సందడి చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా మనోజ్ తన ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా చెప్తుంటాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మనోజ్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ‘ఇంట్లో ఇలా నా ఫ్రెండ్స్, సోదరులం అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసాడు. అలానే ‘నవీన్ వండిన బిర్యానీ సూపర్‌గా ఉంది. ఇక రంజిత్ చేసిన బట్టర్ చికెన్ అయితే అంతకు మించి టేస్టి గా ఉంది. విరుపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న తేజ్ బాబాయ్‌కి కంగ్రాట్స్’ అంటూ మనోజ్ ట్వీట్‌లో రాసాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా బిర్యానీ వండటం లో నవీన్ ఎక్స్‌పర్ట్ అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

Share post:

Latest