అజిత్- నాగ్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. కానీ ఆ బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న నాగార్జున..!

తెలుగు ప్రేక్షకులకు వెండితెర మన్మధుడు అనగానే అక్కినేని నాగార్జున గుర్తుకు వస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నాగార్జున తన కెరీర్ లో ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలు చేసినందుకు వెనకడుగు వేయరు.

King's power packed special in Kollywood Star's thriller? | cinejosh.com

చాలాకాలంగా నాగార్జునకు సరైన విజయం పడటం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో హిట్ అందుకున్న తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించినిన ఆయన అప్పట్లో సమయం దొరకక చేయాలనుకున్న సినిమాలను కూడా చేయలేకపోయారు.. అందులో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన గ్యాంబ్లర్ కూడా ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, యాక్షన్ హీరో అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Telugu Ajith Kumars, Ajithnagarjuna, Arjun Sarja, Venkat Prabhu, Gambler, Ajith,

డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా అజిత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా మిగిలిపోయింది.ఈ మూవీ కంప్లీట్ గా.. గ్రేషేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తోనే నడుస్తుంది. కోలీవుడ్ లో గ్రే షేడ్స్ హీరోయిజంతో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. అయితే ఈ మూవీలో నాగార్జున నటించాల్సి ఉందని.. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట.

Telugu Ajith Kumars, Ajithnagarjuna, Arjun Sarja, Venkat Prabhu, Gambler, Ajith,

ఈ విషయాన్ని స్వయంగా వెంకట్ ప్రభు బయటపెట్టారు. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో భాగంగా ఈ చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లను ఎంతో జోరుగా చేస్తున్నారు. ఇక‌ రీసెంట్గా జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన గ్యాంబ్లర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో అర్జున్ పోషించిన పోలీస్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను అనుకున్నారట.

Nagarjuna, Naga Chaitanya Are Confident Bangarraju Will Be A Success,  Reveal It Is A "Proper Sankranthi Festival Film

నాగ్‌ను దృష్టిలో ఉంచుకునే కథను కూడా డిజైన్ చేశారట. అంతేకాదు నాగార్జునకు ఈ స్టోరీ చెప్పగా చాలా నచ్చిందని సినిమా చేయడానికి డేట్ లో అడ్జస్ట్ అవ్వకపోవడంతో అర్జున్‌తో ఆ సినిమా చేసామని దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు. వెంక‌ట్ ప్ర‌భు ఇప్పుడు నాగ్‌ కొడుకు నాగచైతన్యకు సూపర్ హిట్ ఇస్తానని ఎంతో ధీమా వ్యక్తం చేశారు. ఇక మరి కస్టడీ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

Share post:

Latest