`ఆదిపురుష్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. అస‌లు ట్విస్ట్ తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీతగా న‌టించారు. అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే చేశారు.

జూన్‌ 16న ప్రపంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా విడుద‌లైన ట్రైల‌ర్ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ట్రైల‌ర్ తో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఆదిపురుష్ కు ఫ‌స్ట్ ఛాయిస్ ప్ర‌భాస్ కాద‌ట‌.

మొద‌ట ఈ చిత్రాన్ని ఓ బాలీవుడ్ స్టార్ రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు హృతిక్ రోషన్. ఇక్క‌డ అస‌లు ట్విస్ట్ తెలిస్తే షాకైపోతారు. ఓం రౌత్ మొద‌ట హృతిక్ రోష‌న్ రాముడిగా, ప్ర‌భాస్ ను రావ‌ణుడిగా అనుకున్నాడ‌ట‌. ఇందులో భాగంగా మొద‌ట హృతిక్ కు క‌థ వినిపించాడ‌ట‌. అయితే హృతిక్ రోషన్ కొన్ని కీలక మార్పులు చెయ్యాలని సూచించడం, అది డైరెక్టర్ ఓం రౌత్ కి నచ్చకపోవడం తో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభాస్ ని శ్రీరాముడిగా మరియు సైఫ్ అలీ ఖాన్ ని రావణాసురిడిగా పెట్టి ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తీశారు. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Share post:

Latest