సాయి పల్లవి ఆస్తుల లెక్క చూస్తే కళ్ళు జిగేల్.. వామ్మో గట్టిగానే వెనకేసుకుందిగా..!

లేడీ పవర్ స్టార్ అనే ఈ పేరు చెబితే చాలు అందరికీ అర్థమవుతుంది.. ఆ హీరోయిన్ ఎవరో ఊరికనే గుర్తుపట్టేస్తారు. ఇక మరి ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈమె అందం, అభినయం, తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకే ఒక సినిమాతో అందరినీ తన మాయలో పడేసుకుంది.

Sai Pallavi Out Of AK Remake?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే ఓ రేంజ్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈమె సహజ అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కన్నా ముందే మలయాళం లో ప్రేమమ్ సినిమాలో మెరిసింది.

Sai Pallavi looks super radiant in a pastel-hued saree. Fans agree - India Today

ఆ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకుంది. ఈమె ఎంత పెద్ద స్టార్ హీరోతో నటిస్తున్న తన పాత్ర నచ్చితేనే ఆ సినిమాకి ఓకే చెబుతుంది. సౌత్ ఇండియాలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ఈమె ఆస్తుల గురించి తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది.

సాయి పల్లవి కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా | Tollywood Star Heroine Sai Pallavi Properties Details, Sai Pallavi, Sai Pallavi Properties, Sai Pallavi Life Style, Sai Pallavi Assets,sai Pallavi Cars, Heroine Sai

ప్రస్తుతం సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయంపై వార్తలు వస్తుండగా 2020లో సాయి పల్లవి 3 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించారని సమాచారం.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.26 కోట్ల మేర ఆమె కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 30 ఏళ్లు.. 12 ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో అందరినీ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest