ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ వచ్చేసిందోచ్.. ఫాన్స్ ఇక పూనకాలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ రానే వచ్చింది. వాస్తవానికి గబ్బర్ సింగ్ తర్వాత మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈమధ్య కాలంలోనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు చిత్రం యూనిట్.

ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి కూడా చిత్ర బృందం సిద్ధమవుతోంది. అయితే ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తూ.. మే 11 అంటే నేటితో పవన్ అండ్ హరీష్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ స్పెషల్ డే ని మరింత స్పెషల్ గా చేయడానికి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మార్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసి ఫ్యాన్స్ నీ సర్ప్రైజ్ చేసిన చిత్ర బృందం తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్ భగవద్గీత తో మొదలయ్యి.. అటు పవన్ అభిమానులతో పాటు ఇటు సాధారణ సినీ ప్రేక్షకుడిని కూడా బాగా ఆకట్టుకుంది. మరొకసారి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద జాతర తీసుకురాబోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ అభిమానులకు ఈ గ్లింప్ పూనకాలు తెప్పిస్తోందని చెప్పాలి . ఇకపోతే ఇందులో శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share post:

Latest