లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో కాళీ గానే ఉంటున్నాయి. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన టాప్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

నయనతార: కోలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది.. కోకో కోకిల, డోరా, అమ్మోరు తల్లి, కర్తవ్యం వంటి ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తన సత్తా చాటింది.

అనుష్క: తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పునాది వేసింది అనుష్కనే.. ఈమె నటించిన అరుంధతి సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అనుష్క క్రేజ్ ఒక్కసారగా అమాంతం పెరిగిపోయింది. సినిమా తర్వాత అనుష్క రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం వంటి పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది.

సమంత: టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే బేధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది.
సమంత యశోద, శాకుంతలం వంటి సినిమాల తో మన ముందుకు వచ్చింది.

keerthy suresh latest hot

కీర్తి సురేష్: నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన‌ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు చేశారు. అలనాటి హీరోయిన్‌ సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో అంద‌రిన్ని మెప్పించారు కీర్తి సురేష్ . ఈ సినిమాలో ఆమె నటనకుగాను నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత మిస్‌ ఇండియా, పెంగ్విన్, గుడ్‌లక్‌ సఖి, చిన్ని వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు కీర్తి.

Share post:

Latest