బాక్సాఫీస్ వ‌ద్ద `విరూపాక్ష‌` విధ్వంసం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వ‌చ్చాయో తెలిస్తే షాకే!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన `విరూపాక్ష‌` మూవీ రీసెంట్ గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా విధ్వంసం సృష్టిస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 6 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంత‌కు మించి అనేలా రూ. 7.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.77 కోట్ల షేర్ ని అందుకోగా… వరల్డ్ వైడ్ గా రూ. 7.17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఏరియాల వారీగా విరూపాక్ష 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గమ‌నిస్తే..

నైజాం: 7.20 కోట్లు
సీడెడ్: 2.31 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.05 కోట్లు
తూర్పు: 1.10 కోట్లు
పశ్చిమ: 0.85 కోట్లు
గుంటూరు: 1.19 కోట్లు
కృష్ణ: 1.10 కోట్లు
నెల్లూరు: 0.56 కోట్లు
——————————————–
ఏపీ+తెలంగాణ‌=16.36 కోట్లు(27.75 కోట్లు~ గ్రాస్‌)
——————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 1.41 కోట్లు
ఓవ‌ర్సీస్ – 3.05 కోట్లు
—————————————————-
టోటల్ వరల్డ్ వైడ్ = 20.82 కోట్లు(37.00 కోట్లు~ గ్రాస్)
—————————————————-

కాగా, రూ. 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విరూపాక్ష‌.. మూడు రోజుల్లోనే దాదాపు టార్గెట్ ను రీచ్ అయిపోయాడు. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 2.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే స‌రిపోతుంది.