`విరూపాక్ష‌` వ‌సూళ్ల వ‌ర్షం.. 4 రోజుల్లోనే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట‌కే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్లు షేర్ రాబ‌ట్టించిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 20.82 కోట్లు రాబ‌ట్టింది. 4వ రోజు వ‌ర్కింగ్ డే అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా ఓవరాల్ గా 4వ రోజు 3.53 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని లాభాల బాట ప‌ట్టింది. ఏరియాల వారీగా విరూపాక్ష 4 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గమ‌నిస్తే..

 

నైజాం: 8.52 కోట్లు
సీడెడ్: 2.79 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.45 కోట్లు
తూర్పు: 1.32 కోట్లు
పశ్చిమ: 0.97 కోట్లు
గుంటూరు: 1.38 కోట్లు
కృష్ణ: 1.29 కోట్లు
నెల్లూరు: 0.65 కోట్లు
——————————————–
ఏపీ+తెలంగాణ‌= 19.37కోట్లు(32.85 కోట్లు~ గ్రాస్‌)
——————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 1.62 కోట్లు
ఓవ‌ర్సీస్ – 3.36 కోట్లు
—————————————————-
టోటల్ వరల్డ్ వైడ్ = 24.35 కోట్లు(43.35 కోట్లు~ గ్రాస్)
—————————————————-

కాగా, రూ. 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విరూపాక్ష‌.. నాలుగు రోజుల్లోనే టార్గెట్ ను రీచ్ అయింది. ప్ర‌స్తుతం ఈ మూవీ రూ. 1.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది.