యాంకర్ సుమ గొంతు నొక్కిన గోపీచంద్.. షాక్ అయిన ఆడియన్స్..

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో, సెలబ్రిటీ టాక్ షోలలో ఇలా ప్రతీ చోటా సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే “సుమ అడ్డా” అనే ప్రోగ్రామ్‌కి సుమా కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సినీ స్టార్ట్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి వస్తుంటారు.

టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చే ఏకైక షో ఏదైనా ఉంది అంటే సుమా షో మాత్రమే. తాజాగా సుమ అడ్డా షోకి ‘రామ బాణం’ అనే మూవీ టీమ్ వారు హాజరయ్యారు. హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి, దర్శకుడు శ్రీవాస్, నటుడు గెటప్ శ్రీను హాజరయ్యారు. వారు సినిమా కి సంబంధించిన విషయాల గురించి ముచ్చటించారు. వారు చెప్పే విషయాలను వింటూనే మధ్య మధ్యలో సుమ వారితో కొన్ని గేమ్స్ ఆడించింది.

రామ బాణం సినిమా హీరో గోపీచంద్ ఈ ప్రోగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా కనిపించారు. ఎక్కువగా సైలెంట్ ఉండే గోపీచంద్ ఈ ప్రోగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా కనిపించడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. అప్పట్లో సూపర్ హిట్ అయిన జయం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించారు. ఆ సినిమా లో హీరోయిన్ సదా గొంతు పట్టుకొని పైకి లేపే సీన్ లో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు.

ఆ క్యారెక్టర్ ని మరోసారి గుర్తుచేస్తూ అదే సీన్ ని రీక్రియేట్ చేస్తూ సుమా గొంతు పట్టుకొని డైలాగ్ చెప్తాడు గోపీచంద్. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రామ బాణం సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.