క‌న్నీళ్లు పెట్టుకుంటూ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చిన పాయ‌ల్‌.. ఏంటీ అరాచ‌కం?

బోల్డ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ న‌గ్నంగా ద‌ర్శ‌నమిచ్చింది. ఒంటిపై నోలుపోగు లేకుండా అరాచ‌కం సృష్టించింది. గ‌తంలో పాయ‌ల్ ఎన్నో బోల్డ్ ఫోటోషూట్స్ చేసింది. కానీ, తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె తాజా లుక్ మాత్రం అంత‌కు మించి అనేలా ఉంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూడో చిత్రం `మంగ‌ళ‌వారం`.

ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. ఇందులో పాయ‌ల్ రాజ్‌పూత్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యాన‌ర్ల‌పై అజయ్ భూపతి, స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి పాయల్ రాజ్‌పుత్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల అయింది.

ఈ పోస్ట‌ర్ చాలా బోల్డ్ గా ఉంది. సినిమాలో శైలజ పాత్రలో పాయల్ కనిపించబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయ‌ల్ కంటతడి పెట్టుకుంటూ నగ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో క్ష‌ణాల్లో ఆమె లుక్ వైర‌ల్ గా మారింది. వెన‌క నుంచి తీసిన ఈ ప‌లుక్ లో పాయిల్ న్యూడ్‌గా క‌నిపించింది. పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర, ఆమె వేలిపై సీతాకోక చిలుక, జడలో మల్లెపూలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట ఓ రేంజ్ లో సెన్సేష‌న్ సృష్టిస్తోంది. కాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.