జబర్దస్త్ రచ్చ రవి జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

జబర్దస్త్ కామెడీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు సుపరిచితమయ్యారు ..ఈ షోలో చమ్మక్ చంద్ర టీం లో మెయిన్ కమెడియన్ గా ఆడియన్స్ ను బాగా అలరించారు. ఆ తర్వాత రచ్చ రవి కూడా తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను బాగా అదరగొట్టేసారని చెప్పవచ్చు. దీంతో కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలలో బిజీగా అయ్యారు. మరి కొంతమంది స్టార్ హీరోలుగా సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న బలగం సినిమాలో కూడా రచ్చ రవి మంచి పాత్ర పోషించారు..

ఇందులో ప్రతి ఒక్కరి హృదయాలను తాకిన ఈ సినిమాలోని ప్రియదర్శిని స్నేహితుడి పాత్రను నటించారు రచ్చ రవి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రచ్చ రవి తన మనసులో బాధను సైతం బయటపెట్టడం జరిగింది.తన చెల్లెలు తనతో అసలు మాట్లాడడం లేదని తన ఇంటికి కూడా రావడం లేదని కన్నీటిపర్యంతంతో బాధపడ్డారు రచ్చ రవి.. తన చెల్లెలు ఇచ్చిన రూ . 123 రూపాయలతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని ఇప్పుడు తాను ఇంత సంపాదించుకున్న తన చెల్లెలు తన ఇంటికి రావట్లేదని చాలా బాధతో ఏడ్చారు రచ్చ రవి..

రచ్చ రవి మాట్లాడుతూ ప్రతి పండక్కి నేను నా చెల్లి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టించుకుంటాను కానీ కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు మా ఇంటికి రావడం లేదు.. 2016లో తన ఇంటి గృహప్రవేశానికి వచ్చిన తర్వాత నుంచి ఇంటికి రాలేదు నేను ఇంత సంపాదించుకున్నాను అంటే అందుకు కారణం తన చెల్లి రజితనే.. ఆమె ఇచ్చిన ఆ డబ్బుతోనే హైదరాబాదుకి వచ్చాను .. ఇప్పుడు ఇంత సంపాదించి ఆ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తానే కానీ ఇప్పుడు నా చెల్లి నా ఇంటికి రావడం లేదు ఎందుకు అలిగిందో తెలియదు అంటూ తెలిపారు.