బుల్లితెరపై అదరగొడుతున్న టాప్ 5 సీరియల్స్ ఇవే..!

బుల్లితెరపై ఎన్ని రకాల కార్యక్రమాలు వచ్చిన సీరియల్స్ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు,క్రికెట్, పాటలు ఇలా ఎన్ని ప్రసారమైన మహిళ మణుల దగ్గర నుంచి ఆదరణ సొంతం చేసుకున్నవి సీరియల్స్ మాత్రమే. ఎందుకంటే కొంచెం కంటెంట్ డిఫరెంట్ గా ఉంటూ.. ఫ్యామిలీ కథ అయి ఉంటే చాలు ఆ సీరియల్ మహిళల దగ్గర నుంచి భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. అలాంటి సీరియల్స్ కు ఆడవారి దగ్గర నుంచి ఆదరణ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవి ప్రసారమైన వాటిని మహిళలు ఆదరిస్తూనే ఉంటారు. అందుకు గొప్ప ఉదాహరణ కార్తీకదీపం సీరియల్ అని చెప్పాలి.

High TRP Telugu Channel Shows Are Karthika Deepam, Intinti Gruhalakshmi,  Devatha

ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్లకు ఇప్పటికీ సీరియల్స్ తోనే కాలక్షేపం. అందుకే బుల్లి తెరపై ప్రసారం అయ్యే సీరియల్స్‌కు భారీగా టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అయితే వారం వారం ఈ రేటింగ్స్ మారుతూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు మార్చ్ 31వ తేదీ వరకు నమోదైన టిఆర్పి రేటింగ్స్ ప్రకారం తెలుగులో టాప్ సీరియల్స్ అధిక భాగం స్టార్ మా లోనే ప్రసారం అవ్వటం మరో విశేషం. ఆ తర్వాత జీ తెలుగు లో ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ టాప్ 5 ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి.

Brahma Mudi - Disney+ Hotstar

అయితే ఇప్పుడు సీరియల్స్ లో ఎన్నో సంచలనాలు సృష్టించి కొన్నేళ్లు టాప్ ప్లేస్ లో దూసుకెళ్లిన జెమిని టీవీలో వచ్చే ఏ సీరియల్ కూడా టాప్ ప్లేస్ కోసం పోటీ పడలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు టాప్ సీరియల్ గా తాజా టిఆర్పి రేటింగ్స్ ప్రకారం స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి మొదటి ప్లేస్ లో దూసుకుపోతుంది. 11.41 రేటింగ్ తో మొదటి ప్లేస్‌లో దూసుకుపోతోంది.

Guppedantha Manasu tops the TRP chart; here's a look at the new list of top  5 TV shows - Times of India

ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్‌కు క్రమంగా ప్రేక్ష‌క‌ ఆదరణ పెరుగుతోంది. ఈ వారం 9.97 రేటింగ్ తో రెండో స్థానంలో అనూహ్యంగా స్టార్ మాలోనే ప్రసారం అవుతున్న మ‌రో సీరియల్ కృష్టా ముకుందా మురారి రెండో స్థానం దక్కించుకుంది. మూడు, నాలుగు, ఐదు స్థానాలను వరసగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటిటి గ్రహాలక్ష్మి, గుప్పెడంత మనసు, మల్లి వంటి సీరియల్స్ దక్కించుకున్నాయి. ఇక ఈసారి కూడా బుల్లి తెర‌పై స్టార్‌మా మొద‌టి స్థానంలో దూసుకుపోతుంది.