స్టార్ హీరోల ప్రేమలో పడి కెరీర్‌ నాశనం చేసుకున్న హీరోయిన్లు వీళ్లే..!

హీరోయిన్లు స్టార్ హీరోల‌ను ప్రేమించి త‌మ కెరీర్‌ను నాశ‌నం చేసుకుంటున్నారా..అంటే అవున‌నే మాట క‌చ్చితంగా వినిపించ‌క‌పోయినా కొంద‌రు హీరోయిన్లు ఇప్ప‌టికి పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగా ఉంటున్న వారిని చూస్తే అది నిజం అనిపిస్తుంది. మ‌రి ముఖ్యంగా సినిమాల‌లో హీరోయిన్ అవ‌కాశం కోస‌మే ఎంతో కాలం ఎదురుచూస్తారు. ఆవ‌కాశం వ‌చ్చాకా ఆ స‌క్సాస్ చూసి కన్నుమిన్ను కానరు. ఆ హీరోలతోనే ప్రేమలో పడి ఎటూ కాకుండా మిగిలిపోతున్నారు. అలా త‌మ కేరీర్‌ను నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

Tabu transformation: See the 51-year old Bollywood actress' amazing before  and after photos

టబు :
పక్కా హైదరాబాదీ అయిన టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె అప్పట్లో కింగ్ నాగార్జునతో ప్రేమ‌లో ఉండటం వల్లే ఇలా పెళ్లి చేసుకోకుండా మిగిలిందనే టాక్ ఇంకా వినిపిస్తోంది. కానీ, ఈ విషయం అటు టబు గానీ, ఇటు నాగార్జున గానీ ఒప్పుకోరు.

అనుష్క శెట్టి :
కింగ్ నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యోగా టీచర్ అనుష్క శెట్టి. ఈమె పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, ఈ విషయంలో ప్రభాస్ – అనుష్క కొట్టిపారేస్తున్నారు. మధ్యలో అనుష్క శెట్టి..కోవెలమూడి ప్రకాష్‌ను పెళ్లి చేసుకుంటుందని, గోపీచంద్‌ని ప్రేమిస్తుందనీ వార్తలు వచ్చాయి. కానీ, ఏది ఎంతవరకూ నిజమో క్లారిటీ లేదు.

రెజీనా కసాండ్ర :
టాలీవుడ్ మెగా హీరో సాయి ధరం తేజ్‌తో రెజీనా లవ్‌లో ఉందనే ప్రచారం జరిగింది. అయితే, రెజీనా వైఖరి బాగోలేక మెగా ఫ్యామిలీ కాదనుకుందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో గానీ..మెగా హీరోలతో సినిమాలు చేసిన రెజీనా ఇప్పుడు అవకాశాల కోసం ఆవురావురంటోంది. ఇలా మన టాలీవుడ్‌లో మాత్రమే కాక సౌత్‌లో చాలామంది హీరోయిన్స్ హీరోలతో ప్రేమలో పడి మంచి కెరీర్‌ను నాశనమ చేసుకున్నారు.