డైలమాలో పడ్డ స్టార్ హీరో కూతురు కెరియర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈయన కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు పైనే కావస్తోంది. కోలీవుడ్లో మొదట పత్తు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇమే తర్వాత మూడు నాలుగు సినిమాలలో నటించింది. ఇటీవల తెలుగులో లాంచ్ అయిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ తో అర్జున్ కీ విభేదాలు రావడంతో ఈ చిత్రాన్ని ఆపేసినట్లుగా తెలుస్తోంది.

Kannada actor Aishwarya Arjun tests positive for coronavirus |  Entertainment News,The Indian Express
అయితే ఈ విషయం మాత్రం పెద్దగా విశ్వక్ పైన ప్రభావం చూపలేదు.. కానీ అర్జున్ కుమార్తె ఐశ్వర్య కు మాత్రం ఒకరకంగా ఇబ్బంది అని చెప్పవచ్చు. అర్జున్ ఒకప్పుడు స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో కుమార్తెతో స్వయంగా సినిమాను నిర్మించాలని తమిళం తర్వాత టాలీవుడ్ లో మార్కెట్ కలిగిన కొంతమంది హీరోలతో లాంచ్ చేయడం జరిగింది.కానీ ఆరంభంలోనే ఈ ప్రయత్నం బెడిసి కొట్టడం జరిగింది.

Aishwarya Arjun tests Covid-19 positive || Aishwarya Arjun tests Covid-19  positive

దీంతో ఐశ్వర్య టాలీవుడ్ డెబ్యూ ఆగిపోయింది అంటూ జనాలలో నెగిటివ్ మార్కు ఏర్పడింది. మరి తమిళంలో లాంచ్ అయిన ఈమె బిజీగా అవుతుందా అంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఐశ్వర్య నాటిక కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ పదేళ్లు అవుతున్న ఇంకా ఐదారు సినిమాలలోనే నటించింది. స్టార్ హీరో కూతురు అయ్యుండి కూడా అవకాశాలు వచ్చాయని కొంతమంది వాదిస్తూ ఉండగా మరి కొంతమంది మాత్రం కేవలం తన తండ్రి ఇమేజ్ను లాంచింగ్ వరకే పరిమితం చేయకుండా.. తండ్రి పరిచయాన్ని ఉపయోగించుకొని అవకాశాలు అందుకొని 2 ఏళ్లు మాత్రం బాగానే కొనసాగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య కెరియర్ పైన పలు రకాలుగా విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈమె కెరియర్ ఇప్పుడైనా పుంజుకుంటుందా లేదా అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.