సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న శ్రీముఖి.. కారణమదే!

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తుంది. పలు కార్యక్రమాలో కనిపిస్తు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందీ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. గ్లామర్స్ ఫొటోలు తో ఎప్పటికప్పుడు అభిమానులను అల్లరిస్తూ ఉంటుంది. శ్రీముఖి ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టినప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అయినప్పటికీ ఆమెకి సినిమాలో పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.

కేవలం చిన్న సినిమా ఆఫర్స్ వస్తున్నాయని శ్రీముఖి సినిమాలకు కాస్త దూరంగా ఉంటుందట. కొత్త హీరోలు, చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలలో శ్రీముఖి ని హీరోయిన్ గా అడుగుతున్నారట. శ్రీముఖి యాంకరింగ్ వల్ల వారి సినిమాలకు కావాల్సినంత బజ్ దొరుకుందని భావనతో కొంతమంది ఆమెని తమ సినిమాలో నటించడానికి ఒప్పుకోమని అడుగుతున్నారట. కానీ మన బుల్లితెర రాములమ్మ మాత్రం అలాంటి సినిమాలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

అలా గుర్తింపు లేని దర్శకుడు, హీరోల సినిమాలో నటిస్తే ప్రస్తుతం ఉన్న అవకాశాలు కూడా చేజారిపోతాయన్ని శ్రీముఖి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అందుకే కొత్త దర్శకులు, హీరోలకు చాలా సులభంగా నో అని చెప్పేస్తుందట. అయితే శ్రీముఖితో నటించాలని చాలామంది యంగ్ హీరోలు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీముఖి మాత్రం వారితో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే శ్రీముఖి అసలు ఎలాంటి పాత్రలో నటిస్తుంది, ఏ హీరోకి జోడిగా నటించాలి అనుకుంటుందో అర్థం కావడం లేదు అంటూ కొంతమంది నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే శ్రీముఖి సినిమాలో బిజీ అవాలని చాలా మంది కొరుకుంటున్నారు.