స‌మంత ద‌గ్గ‌ర ఉన్న అత్యంత ఖ‌రీదైన 5 వస్తువులు ఏంటో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మంత‌.. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్ర‌భావం కెరీర్ పై ప‌డ‌కుండా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని దున్నేస్తోంది. అలాగే రెమ్యున‌రేష‌న్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటోంది.

ఇక‌పోతే ల‌గ్జ‌రీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న స‌మంత వ‌ద్ద ఐదు అత్యంత ఖ‌రీదైన వ‌స్తువులు ఉన్నాయ‌ట‌. వాటి గురించి ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. సమంత దగ్గర మలానో బ్లహనిక్స్ కంపెనీకి చెందిన చెప్పులు ఉన్నాయ‌ట‌. వాటి ఖరీదు అక్షరాలా రూ. లక్ష రూపాయాలు. అలాగే సమంత వ‌ద్ద రెండు అత్యంత విలువైన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయ‌ట‌.

అందులో ఒక‌టి బ్యాగ్ గుస్సీ కంపెనీకి చెందినది. దీని ధర రూ. 1.40 లక్షల రూపాయాలుగా తెలుస్తోంది. మ‌రిక‌టి క్రిస్టియన్ డియోర్ హ్యాండ్‌బ్యాగ్. ఈ బ్యాగ్ ధర రూ. 2.5 లక్షలు. సమంత `సాకీ` పేరిట క్లాతింగ్ బ్రాండ్ ను ర‌న్ చేస్తోంది. ఈ కంపెనీ విలువ రూ. 84 కోట్లు ఉంటుంద‌ట‌. తన సొంత కంపెనీ అయిన సాకీ వరల్డ్ బ్రాండ్స్ నే సామ్ వాడుతుంటుంది. ఇక జూబ్లీహిల్స్ లో స‌మంత‌కు ఇంద్ర భ‌వ‌నాన్ని త‌ల‌పించే ఇల్లు ఉంది. ఈ ఇంటి ఖ‌రీదు రూ. 30 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌.