నాగ చైత‌న్య‌-శోభిత ఎఫైర్‌పై స్పందించిన స‌మంత.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో ల‌వ్ ప‌డ్డాడని.. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ ఎఫైర్ న‌డుస్తోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ లో ఒక రెస్టారెంట్ లో నాగ చైత‌న్య‌, శోభిత ఉన్న పిక్ బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది.

దీంతో త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య‌, శోభిత డేటింగ్ వార్త‌లు మ‌రింత ఊపందుకున్నాయి. అయితే వీరి రిలేష‌న్ పై స‌మంత మాట్లాడిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంటి. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి.

తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది` అని స‌మంత శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో చెప్పిన‌ట్లుగా ఓ మీడియా సంస్థ క‌థ‌నం రాసింది. అయితే ఈ క‌థ‌నంపై స‌మంత స్పందించింది. `నేనెప్పుడూ అలా చెప్పలేదు` అంటూ ట్వీట్ చేసింది. అదంతా అస‌త్య ప్ర‌చారమ‌ని, నాగ చైత‌న్య‌-శోభిత ఎఫైర్ పై తాను ఎక్క‌డా మాట్లాడ‌లేద‌ని ఒక్క ట్వీట్ తో స‌మంత క్లారిటీ ఇచ్చింది. దీంతో స‌మంత ట్వీట్ కాస్త వైర‌ల్ గా మారింది.

https://twitter.com/Samanthaprabhu2/status/1643135242025283585?s=20