శాకుంతలం మూవీ, గుణశేఖర్ కలలను సమంత నిజం చేసిందా?

టాలీవుడ్ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్లో సమంత లీడ్ హీరోయిన్ గా చేసిన శాకుంతలం సినిమా రిలీజుకి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే టాక్ బయటకి వచ్చేసింది. అదెలా అంటే ప్రివ్యూ షోస్ ద్వారా. అవును, పలువురు ఈ ప్రివ్యూ షోస్ చూసి తమ మనసులోని మాటలను మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిందని చెప్పుకోవాలి. ఇక ప్రివ్యూ షోస్ కూడా వేయడంతో సినిమా టాక్ అనేది రిలీజుకి ముందుగానే వచ్చేసింది.

ఈ సినిమాకోసం దర్శకుడు గుణశేఖర్ ఏరికోరి మరీ సమంతను తీసుకున్నాడు. ఆమెకూడా కొంతకాలంగా డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది అని చెప్పుకోవాలి. కాగా సమంత కెరీర్లో శాకుంతలం తొలి పౌరాణిక సినిమా కావడం విశేషం. దిల్ రాజు తన స్ట్రాటజీ ఉపయోగించి పలు చోట్ల శాకుంతలం మూవీ ప్రదర్శించారు. అయితే ఈ ప్రివ్యూ షో చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై పాజిటివ్ గా రియాక్ట్ కావడం విశేషం. ఈ శాకుంతలం మూవీలో సమంత చాలా నాచురల్ గా నటించిందని, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే సూపర్ గా సెట్ అయిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుందనే టాక్ బయట వినబడుతోంది.

కడుపుతో ఉన్నపుడు శకుంతల బాధపడిన సీన్స్, ఆమె పడిన కష్టాలు ఈ సినిమాలో హైలైట్ సన్నివేశాలని అంటున్నారు. తదితర సన్నివేశాల్లో సమంత బాగా ఒదిగిపోయింది చెబుతున్నారు. అంతేకాకుండా గ్రాఫిక్ వర్క్ కూడా బాగా కుదిరిందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ నటన కూడా బావుందని అంటున్నారు. ఏది ఏమైనా ఫైనల్ గా శాకుంతలం సినిమాకు ఓ పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. గుణశేఖర్ టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకుల నుంచి స్పందన తెలియాలి అంటే మనం ఏప్రిల్ 14 దాకా వెయిట్ చేయాల్సిందే.