చ‌మ్కీల చీర‌లో ర‌కుల్ గ్లామ‌ర్ మెరుపులు.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తోంది. కానీ, స‌క్సెస్ మాత్రం ర‌కుల్ కు ఆమ‌డ దూరంలో ఉంటోంది. గ‌త ఏడాది ర‌కుల్ న‌టించిన ఐదు చిత్రాలు నార్త్ లో ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

రీసెంట్ గా ‘ఛత్రివాలీ‘ సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా బాగానే ఆక‌ట్టుకున్నా.. ఓటీటీలో నేరుగా విడుద‌ల కావ‌డం వ‌ల్ల ర‌కుల్ కు ఒరిగిందేమి లేకుండా పోయింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో నెటిజ‌న్ల‌కు మైండ్ బ్లాక్ చేస్తోంది.

 

తాజాగా చ‌మ్కీల చీర‌ల‌తో మ‌రోసారి ర‌కుల్ గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. టాప్ యాంగిల్ నుంచి ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్ ఫోటోల‌కు పోజులిచ్చింది. ర‌కుల్ తాజా పిక్స్ చూసి ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ నెటిజ‌న్లు ఆగ‌మాగం అవుతున్నారు.