ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి కూడా గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి నుంచి నేటితరం హీరోయిన్‌లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా చిరు నటించాడు.
అయితే చిరంజీవి ఎంత మంది హీరోయిన్లతో నటించిన ఇష్టమైన హీరోయిన్ మాత్రం రాధిక అని అంటారు. 40 ఏళ్ల క్రితం మొదలైన వారి పరిచయం ఇప్పటికీ బలంగానే కొనసాగుతుంది. ఈ విషయం ఎన్నో సందర్భాలలో చిరు రాధిక మీడియాతో పంచుకున్నారు. చిరంజీవితోనే రాధిక కెరీర్ ప్రారంభమైంది. న్యాయం కావాలి అనే అనే సినిమాతో రాధిక- చిరంజీవి హీరో, హీరోయిన్‌లుగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి మొదటి సినిమా షూటింగ్ సమయం నుంచి వీరి మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడింది అప్పటినుంచి వారు ఇప్పటి వరకు కూడా మంచి స్నేహీతులగానే కోన్నసాగుతున్నారు. అయితే మధ్యలో వారి అన్యోన్యతను చూసి అనేక రూమర్స్ కూడా వచ్చాయి.
వీరిద్దరి తొలి సినిమా న్యాయం కావాలి లో రాధిక చిరంజీవిని చెంప మీద కొట్టాలి.. ఆ సన్నివేశం కోసం రాధిక- చిరంజీవిని ఏకంగా 24 సార్లు చెంప మీద కొట్టిందట. దాంతో అయన చెంప బాగా కందిపోయింది.. చెంప ఎర్రగా ఉబ్బిపోయింది. దాంతో రాధిక వెళ్లి ఆయనకు సారీ చెప్పింది అప్పుడు చిరు పరవాలేదు అమ్మా నా చెంపను బాగానే వాయించవమ్మా అంటూ నవ్వారు అని రీసెంట్గా జరుగును ఓ ఇంటర్వ్యూలో రాధిక ఈ విషయాలను గుర్తు చేసుకుంది.