అభిమానులనే విసుకు పుట్టించేలా చేస్తున్న పవన్ సినిమా..!!

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైనే కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ రాలేదు. ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలవుతుందని తెలుపగా.. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Hari Hara Veera Mallu Power Glance: Pawan Kalyan has no competition |  Entertainment News,The Indian Express

పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులలో ఎక్కడలేని ఉత్సాహం జోష్ ఉంటుంది. కానీ వీరమల్లు సినిమాకు మాత్రం అది మిస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. హరి శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అతని రిక్వెస్ట్ చేయగా వీరమల్లు సినిమా గురించి పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విషయంపై ఎక్కడా కూడా అప్డేట్ అడగడంతో ఈ సినిమాని పూర్తిగా అభిమానులు మర్చిపోతున్నారేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది .కానీ హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం అసలు ఇలాంటి బజ్ ఏర్పడలేదు. అభిమానులకే ఈ సినిమా పైన విసుగు తెప్పించేలా కనిపిస్తోంది.మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాని పూర్తిగా మరిచిపోయే అవకాశం ఉందని సమాచారం.