అకీరా చేసిన పనికి ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ల‌బోదిబో.. ఇంత పెద్ద షాకిచ్చాడేంటి?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ ల‌కు జ‌న్మించిన అకీరా నంద‌న్ ఎప్పుడెప్పుడు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కానీ, తాజాగా అకీరా నంద‌న్ ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు.

కానీ, హీరోగా కాదు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కాబోతున్నాడు. 19 ఏళ్ల అకిరా రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంగీతాన్ని అందించాడు. ఈ విషయాన్ని ప్రముఖ హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఓ రైట‌ర్ క‌థ‌ను రాసే క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్ల‌ను ఫేస్ చేశాడ‌నేదే ఈ షార్ట్ ఫిల్మ్ క‌థాంశం. నాలుగున్న‌ర నిమిషాలు నిడివి క‌లిగి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ లింక్ ను అడివి శేష్ త‌న పోస్ట్ కు జ‌త చేశాడు.

ఇంగ్లీషులో రూపుదిద్దుకున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించారు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వారంతా అకిరా అందించిన సంగీతం ఆక‌ట్టుకునే విధంగా ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కానీ, ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అకీరా చేసిన ప‌నికి ల‌బోదిబోమంటున్నారు. వెండితెర‌పై హీరోగా చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటూ.. ఇలా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాడ‌ని అస్స‌లు ఊహించ‌లేదంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అకిరా టాలెంట్ కు ఫిదా అవుతూ స‌పోర్ట్ ను నిలుస్తున్నారు.

https://twitter.com/AdiviSesh/status/1646106783143059457?s=20