మౌనిక‌తో ప్రేమ‌..పెళ్లికి ముందే అది జ‌రిగిందంటూ సీక్రెట్స్ లీక్ చేసిన మ‌నోజ్‌!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. మార్చి 3న భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. వీరి వివామం మంచు ల‌క్ష్మి నివాసంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మనోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మౌనిక కు మొద‌టి భ‌ర్త ద్వారా ఒక కూమారుడు కూడా ఉన్నాయి. అయితే ఆ కూమారుడు బాధ్య‌త‌ల‌ను మనోజ్ తీసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా భార్య మౌనిక‌తో క‌లిసి మ‌నోజ్ ‘అలా మొదలైంది’ షోలో మెరిశాడు. ఈ షోకు వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీ క‌పుల్స్‌ ఈ షోలో సంద‌డి చేయ‌గా.. తాజా ఎపిసోడ్ కు మనోజ్ – భూమా మౌనికా రెడ్డి గెస్ట్ లుగా అహ్వానించారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో బ‌య‌ట‌కు వచ్చింది. ఈ షోకు మ‌నోజ్ ఎన్నో సీక్రెట్స్ ను లీక్ చేశాడ‌ని ప్రోమో బ‌ట్టీ అర్థ‌మ‌వుతోంది.పెళ్లికి ముందు మొబైల్ లో ‘ఫోన్ నువ్వు పెట్టేయ్ కాదు నువ్వు పెట్టేయ్’ వంటివి అయ్యాయా? అని వెన్నెల కిషోర్ అడిగ‌గా.. ఎస్ పెళ్ళికి ముందు అది జ‌రిగింది అంటూ ఇద్దరూ ఒప్పుకున్నారు.

ఇద్ద‌రిలో ఎవ‌రు రొమాంటిక్ అని ప్ర‌శ్నిస్తే.. మ‌నోజ్ తానే అని ఒప్పుకున్నాడు. `అమ్మ చనిపోయాక ఆమె బర్త్ డే రోజు ఆలోచిస్తూ బాధ‌గా ఉన్నాను. అంతలో మనోజ్ వ‌చ్చాడు.. నా బాధ‌ను పోగొట్టాడు. ఆ రోజే మ‌నోజ్ తో ప్రేమ‌లో ప‌డ్డాను` అంటూ మౌనిక ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది. ఇక మ‌నోజ్ మాట్లాడుతూ.. తాను, మౌనిక ఒక‌టి కావ‌డానికి పెద్ద యుద్ధ‌మే చేశామ‌ని.. ఎన్నో సంవత్సరాలు దేశదేశాలు తిరుగుతూ వనవాసం చేశాం. అన్నీ డోర్లు మూసేసినా మేము వెన‌క్కి త‌గ్గ‌లేదు` అని మ‌నోజ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.