చెక్కుచెదరని హీరోయిన్ ‘ప్రేమ’ అందం… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ ప్రేమ గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. నేటి తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్నటి తరానికి హీరోయిన్ ప్రేమ అంటే ఓ అందాల భరిణి అని తెలుసు. పేరుకి తగ్గట్టే అచ్చమైన తెలుగందం ఆమె సొంతం. అందుకే ఆడామగ అనే తేడాలేకుండా అందరూ ఆమె ప్రేమలో పడేవారు. ‘దేవి’ సినిమాలోని ప్రేమను చూసిన యువత అయితే అప్పట్లో మనసుపారేసుకున్నారు. అందులో మీరు కూడా వుండే వుంటారు. కాగా ఆమె వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. అయినా ఆమె 25 ఏళ్ళ ముద్దుగుమ్మలాగా ఉందంటే మీరు నమ్ముతారా?

నిజం, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా యువత ఆమె అందాన్ని చూసి నమ్మలేకపొతున్నారు. ఆమె అప్పటికీ, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో తొణికిసలాడుతోంది. వివాహం కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా ఆమె ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేసారు. కానీ మన తెలుగు సినిమాల్లోని మాత్రం కనబడడం మాత్రం చాలా అరుదు. 1995లో ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ఓంకారం’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన ఈ మూవీ కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావడంతో రెండూ చోట్ల ఆమె మంచి గుర్తింపు సంపాదించింది.

2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచును వివాహం చేసుకున్న ప్రేమ పదేళ్ల పాటు కలిసుండి 2016లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రేమ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రేమ మరోసారి సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో నివాసం ఉంటోంది. మళ్లీ సినిమాల్లో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తనకు సినిమాలు ముఖ్యం కానప్పటికీ మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటున్నానని చెబుతోంది. మరి ప్రేమ ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి.