తార‌క్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు… ఎన్టీఆర్ – హృతిక్‌రోష‌న్ మ‌ల్టీస్టార‌ర్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ హీరోలు ఎక్కువ ఆశపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి రాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో తెలుగు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

War 2: RRR Star Jr NTR Joins The Action Extravaganza To Lock Horns With Hrithik  Roshan?

అదేవిధంగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్లో రామ్ చరణ్ కూడా అలరించబోతున్నాడు. ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ తెరమీదకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వార్ సినిమాకు రాబోయే సిక్వల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న వార్2 ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లనుంది.

War (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

స్పై యూనివర్స్‌ ‘వార్‌-2’ లో హృతిక్‌ రోషన్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌ కూడా నటించబోతున్నట్లు ఓ ప్రముఖ సంస్థ తన కథనంలో పేర్కొంది. యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్‌-30వ‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

హృతిక్‌-ఎన్టీఆర్‌ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు ‘నువ్వా నేనా’ అన్నట్టు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్- హృతిక్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.